వృధా

ఒక జీవితం గడిస్తే వచ్చేది ఏముంది.
ఒక జీవితం ముగిస్తే పోయేది ఏముంది.
సృష్టికర్త చేసిన బొమ్మల కొలువులో,
ఏదో సాధించామన్న మాయలో,
నిన్ను నువ్వు మోసపోతున్నావు.
ప్రాణం ఇచ్చిన అమ్మ ప్రేమను మరిచి,
ప్రాణం తీసే ప్రేమ కొరకు పరుగెడుతున్నావు.
కాలం వృథా చేస్తూ,కన్నీటిని వృథా చేస్తూ
రోజు దగా పడుతున్నావు.
నీకై నువ్వు ఓడిపోతే తప్ప మానవత్వం గుర్తురాదు.
నీకై నువ్వు మారితేయ్ తప్ప సమాజంలో మార్పు రాదు.
జీవితం విలువ లెక్క కట్టలేవు.
జీతం విలువ అప్పు కట్టలేవు.
బుడుగంతా జీవితానికి గోడుగంటి ఆశలు,
అడుగంటే ఆశలకు ఆవిరైపోతున్న ప్రాణాలు…

– సౌమ్యస్వరం –

error: