వెనిజులా అధ్యక్షుడిపై హత్యాయత్నం

వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై హత్యాయత్నం జరిగింది. దేశ రాజధాని కరాకస్‌లో వేల మంది సైనికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తుండగా..ఆయనపై డ్రోన్లతో దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో నికోలస్ క్షేమంగా బయటపడ్డప్పటికీ, ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. నేషనల్‌ గార్డ్స్‌ 81వ వార్షికోత్సవం సందర్భంగా సైనికులను ఉద్దేశించి మదురో ప్రసంగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పేలుడు తర్వాత హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి. కొలంబియా, అమెరికాకు చెందిన కొందరు ఆర్ధిక వేత్తలే తనపై దాడికి కుట్ర పన్ని ఉంటారని నికోలస్ ఆరోపించారు.

error: