శ్రావణి అతనివల్లే చనిపోయిందా…!

హైదరాబాద్‌: తెలుగు సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన దేవరాజ్‌రెడ్డి కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతడు గురువారం ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

విచారణలో భాగంగా దేవరాజ్‌రెడ్డి పలు సంచలన విషయాలు వెల్లడించాడు.
దీంతో ఈ కేసులో మరో అనుమానితుడిగా ఉన్న సాయికృష్ణ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటప డుతున్నాయి.సాయికృష్ణ, శ్రావణి కుటుంబ సభ్యులు కొట్టడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కొడుతున్నారంటూ, శ్రావణి దేవరాజ్‌తో మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు బయటకు వచ్చాయి. ఇందులో తన చావుకు సాయి కారణమని శ్రావణి చివరిసారిగా మాట్లాడిన మాటలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో గతంలోనూ దేవరాజ్‌ను, సాయి రక్తం వచ్చేలా కొట్టినట్లుగా సాక్ష్యాలు బయటపడ్డాయి. ఇక సాయి అమ్మాయిలను ట్రాప్ చేస్తాడని ఆరోపించిన దేవరాజ్‌ శ్రావణిని కూడా ఇలాగే ట్రాప్‌ చేసినట్లు తెలిపాడు.తన నుంచి విడిపోవాలంటూ ఆమెను వేధింపులకు గురిచేసినట్లు పేర్కొన్నాడు.కాగా ఈ కేసులో ఆర్‌ఎక్స్‌100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

నా ఫేవరేట్ హీరో దేవరాజ్ రెడ్డి: శ్రావణి.

ఈ కేసు విచారణ నేపథ్యంలో గతంలో దేవరాజ్ పుట్టినరోజు సందర్భంగా శ్రావణి మాట్లాడిన‌ వీడియో ఒకటి బయటకు వచ్చింది.
‘‘నా ఫేవరేట్ హీరో దేవరాజ్ రెడ్డి ఎంతోమంది పరిచయమైనా నువ్ మాత్రమే స్పెషల్ నీలో నాకు ఎప్పుడూ మిస్టేక్ అనిపించలేదు నా ఫ్యామిలీ మెంబర్ లా నువ్ నాతో ఉన్నావ్.
నేను ఎక్కడున్నా నీకు శుభాకాంక్షలు చెప్తాను.
నేను చాలాసార్లు హర్ట్ చేశాను.నేను ఎవరికీ సారీ చెప్పను నీకు మాత్రమే చెప్తున్నాను.
నిన్ను ఏమన్నా నన్ను తిరిగి ఒక్క మాట అనవ్.
నాకు ఫోన్ చెయు అప్పుడపుడు’’అంటూ శ్రావణి దేవరాజ్‌పై తనకున్న అభిమానం చాటుకుంది.

error: