షూటింగ్ లో గాయపడ్డ కబాలి నటి ధన్సిక

రజినీకాంత్ కబాలి తో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ధన్సిక ఓ షూటింగ్ లో గాయపడింది.యోగి డా అనే మూవీ కి సంబంధించి బార్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది.కొందరు రౌడీ లు ధన్సిక పైకి బీరుబాటిళ్ళు విసిరే సన్నివేశంలో పగిలిన గాజుముక్క ఆమె కంటి కింది భాగంలో గుచ్చుకుంది.దీంతో యూనిట్ దన్సికను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించింది.అనంతరం ఆమె మళ్ళీ షూటింగ్ లో పాల్గొంది.

error: