సచివాలయం కూల్చివేతను నిలిపేసిన హైకోర్టు

సచివాలయ భవనాల కూల్చివేత పనుల్ని సోమవారం వరకూ నిలిపివేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కూల్చివేత లకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. చట్ట ప్రకారం కూల్చివేత పనులకు తీసుకున్న అనుమతుల గురించి పూర్తి వివరాలు నివేదించాలని ఆదేశిం చింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మా సనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సచివాలయ భవ నాల్ని కూల్చివేయడాన్ని సవాల్‌ చేస్తూ ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం, చట్టానికి వ్యతి రేకంగా ప్రభుత్వం కూల్చి వేతలకు పాల్పడుతోందని భావించినప్పుడు ప్రజలు ఎవరైనా న్యాయస్థానాల్లో సవాల్‌ చేయవచ్చునని స్పష్టం చేసింది. కూల్చివేత చర్యలు 2016లో కేంద్రం జారీ చేసిన నిర్మాణాలు, కూల్చివేత, వ్యర్థాల నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు లేదని వ్యాఖ్యానించింది.

ఆ నిబంధనల్లో 4(3) ప్రకారం అనుమతి తీసుకున్న పత్రాలు సమ ర్పించాలని కోరగా, శనివారానికి విచారణ వాయిదా వేస్తే సమర్పిస్తామని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ చెప్పారు. ఇందుకు నిరాకరించిన ధర్మాసనం విచారణను 13వ తేదీ సోమవారానికి వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకూ కూల్చివేత లను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

error: