టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమ ప్రస్థానం, తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను తెలిపే ఫోటోలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిబిషన్ ప్రారంభించిన తర్వాత మంత్రులు తిలకించారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రులు కె.టి. రామారావు, పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు.