సుందర్ పిచాయ్‌కి నోటీసులు

గూగుల్‌ సెర్చిఇంజీన్‌లో  చైనీస్ వెర్షన్‌  రూపొందించే ప్రణాళికలపై  సెనేటర్లు తీవ్రంగా  స్పందించారు. అమెరికా సెనేట్‌లోని ఆరుగురు సభ్యులు పిచాయ్‌కు సమన్లు జారీ చేశారు. పిచాయ్‌కు. తాజా మీడియా నివేదిలకపై  వివరణ ఇవ్వాల్సిందిగా  ఒక లేఖ రాశారు.  గుగుల్‌ నిర్ణయానికి కొత్తగా ఏం మారిందో చెప్పాలని  ప్రశ్నించారు. ఇదే నిజమైతే ఇది చాలా ప్రమాదకరమైన పరిణామంగా తమ లేఖలో పేర్కొన్నారు. అలాగే సెన్సార్‌షిప్‌ నిబంధనలకు లోబడి, ప్రధాన విలువలతో రాజీ లేకుండా వ్యవహరిస్తున్న ఇతర టెక్‌ కంపెనీలకు  ఆందోళనకర పరిణామమని వ్యాఖ్యానించారు.

error: