సెన్సెక్స్‌ 250 పాయింట్ల లాభంలో

ట్రేడింగ్‌ ప్రారంభంలో మార్కెట్లు మంచి లాభాలతో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీని బీట్‌ చేసింది. నిఫ్టీ సైతం తన కీలకమైన మార్కు 11,300 పైకి ఎగిసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 250 పాయింట్ల లాభంలో 37,415 వద్ద, నిఫ్టీ 77 పాయింట్ల లాభంలో 11,321 వద్ద ట్రేడవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాల షేర్లు లాభాల బాట పట్టాయి.

ప్రధానంగా ఫార్మా, ఆటో, రియల్టీ, బ్యాంకింగ్‌, మెటల్‌ 0.8 శాతం చొప్పున ఎగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.6 శాతానికి పైగా పెరిగింది. ఐబీ హౌసింగ్‌ 6 శాతం, పీవీఆర్‌ 7 శాతం జంప్‌చేయగా.. గెయిల్‌, టీసీఎస్‌, యాక్సిస్‌, ఎంఅండ్ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌, కొటక్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, సన్‌ ఫార్మా, ఆర్‌ఐఎల్‌ 1.5-1 శాతం మధ్య లాభపడ్డాయి. టెక్‌ మహింద్రా, హెచ్‌పీసీఎల్‌, టైటాన్‌ కంపెనీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌లు టాప్‌ లూజర్లుగా నష్టాలు పాలయ్యాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా 29 పైసల నష్టంలో 68.72 వద్ద ట్రేడవుతోంది.

error: