సొంత ఊరిలో సెలెబ్రెటీగా రేణు మండల్

సంగీతం నేర్చుకొని పాడటం సింగర్స్ చేసే పని. సంగీతం నేర్చుకోకపోయినా… అద్భుతంగా పాడటం కొందరికే చెల్లుతుంది. అలాంటివారిలో రణు మండల్ ఒకరు. ప్రస్తుతం ఆమె ఇండియన్ సోషల్ మీడియా సెన్సేషన్. ఆమె ఏదైనా పాట పాడితే విందామని కోట్ల మంది నెటిజన్లు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆమె చాలా పాటలు పాడి… అందరికీ సంతోషం కలిగిస్తున్నారు. ప్రస్తుతం రణు మండల్ అంటే… ఒకప్పటి ముంబైలోని రైల్వే స్టేషన్‌లో బిక్షాటన చేసుకునే మహిళ కాదు. ఇప్పుడామె బాలీవుడ్ సెలబ్రిటీ. ఎంతో మంది ఆమెతో పాటలు పాడించుకునేందుకు క్యూ కడుతున్నారు. టీవీ ఛానెళ్లు, రేడియో FM స్టేషన్లూ, యూట్యూబ్ ఛానెళ్లూ ఆమె ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నాయి. అంతలా బిజీ అయిపోయారు రాణు మండల్.  మ్యూజిక్ కంపోజర్ హిమేష్ రేష్మియా ద్వారా రణు మండల్ సింగర్‌గా పరిచయమయ్యారు. రైల్వేస్టేషన్‌లో ఆమె బాగా పాడతారని తెలుసుకున్న హిమేష్ రేష్మియా… ఆమెను తన స్టూడియోకి తీసుకెళ్లి… తేరీ మేరీ కహానీ సాంగ్ పాడించారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత కూడా ఆమె పాడిన చాలా పాటలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ బిజీ టైమ్‌లో రణు మండల్‌కి ఆమె చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ నుంచీ… ఓసారి రమ్మని ఆహ్వానం అందింది. … దాంతో ఆ స్కూల్‌కి వెళ్లాలని అనుకున్నారు. ఆమె పుట్టింది కోల్‌కతాలో. చిన్నప్పుడు అక్కడే చదువుకున్నారు.  ముంబై నుంచీ కోల్‌కతాలోని చిన్నప్పటి స్కూల్‌కి వెళ్లిన రణు మండల్… బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. స్కూల్ యాజమాన్యం ఇచ్చిన గౌరవ సన్మానం స్వీకరించారు. చిన్నప్పటి స్కూల్‌కి రావడం మీకు ఎలా అనిపిస్తోందని… ఓ రిపోర్టర్… బెంగాలీ భాషలో అడడగా… ఫ్లూయెంట్ ఇంగ్లీష్, హిందీలో సమాధానం ఇచ్చారు రణు మండల్. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. 

error: