ఒకప్పుడు వీసా ఇవ్వని దేశం ఇప్పుడు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికింది.. సొంత దేశాధ్యక్షుడికి కూడా దక్కనంత ఫాలోయింగ్ మోదీకి దక్కిందక్కడ.. అమెరికాలో హోస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో దాదాపు 50 వేల మంది ప్రేక్షకులు ముక్తకంఠంతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ వేదికపైకి అడుగు పెట్టినప్పటి నుంచి హౌడీ, మోదీ అనే నినాదాలతో ఆ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. మోదీకి ఆహ్వానం పలుకుతూ ప్రేక్షకుల హర్షధ్వానాలతో వేదిక ప్రాంగణం ప్రతిధ్వనించింది. ప్రేక్షకులకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు. అయితే.. మోదీ, ట్రంప్ ఒకేసారి వేదికపైకి రావాల్సి ఉండగా, మోదీని ట్రంప్ గంట సేపు వేచి ఉండేలా చేశారు. అసలేం జరిగిందంటే.. రాత్రి 9:20కి మోదీ వేదికపైకి చేరుకున్నారు. అదే సమయానికి ట్రంప్ హాజరు కావాల్సి ఉంది. మోదీ మాట్లాడాక 9:39కి ట్రంప్ మాట్లాడాల్సి ఉంది. కానీ.. గంట సేపు ఆలస్యంగా 10:25కు వేదిక వద్దకు చేరుకున్నారు..
అయితే.. టెక్సస్‌లోని చాలా చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. ఫలితంగా ఎక్కడ చూసినా వరద నీరే. చాలా చోట్ల కరెంటు సరఫరా లేదు. వరదల కారణంగా ఐదుగురు మృతి చెందారు. దీంతో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తూనే అకస్మాత్తుగా ఎల్లింగ్టన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో దిగి, పరిస్థితులను సమీక్షించాల్సి వచ్చింది. దీంతో కార్యక్రమానికి ఆలస్యంగా బయలుదేరారు. అప్పటికే వేదికపై ఉన్న మోదీ.. విషయం తెలుసుకొని వేదిక దిగి వెళ్లిపోయారు. ట్రంప్ వచ్చాక ఇద్దరు కలిసి వేదికపైకి వచ్చారు.
Tags america president INDIA narendra modi nri prime minister trump