పతన వేగం కొంత తగ్గినప్పటికీ అంతర్జాతీయ నైమెక్స్ కమోడిటీ ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,180 డాలర్ల స్థాయిని తాకుతుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 4 శాతంపైన అమెరికా ఆర్థిక వృద్ధి నేపథ్యంలో అమెరికా డాలర్ బలోపేతం, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు ఇన్వెస్టర్ మొగ్గుచూపడం వంటి అంశాలు దీనికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముంబై ప్రధాన మార్కెట్‌లో వారంలో పసిడి 99.9, 99.5 స్వచ్ఛత ధరలు రూ.270 చొప్పున తగ్గి రూ. 29,605, రూ. 29,455 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ. రూ. 60 తగ్గి రూ. 37,760 వద్ద ముగిసింది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో శుక్రవారం ధర 29,650 వద్ద ముగిసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 68.60 వద్ద ముగిసింది.