1600 వందల కోట్లతో చేపట్టిన పనులు నన్ను మళ్ళీ గెలిపిస్తాయి-గ్యాదరి కిషోర్ కుమార్

ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచిన తుంగతుర్తి తాజా మాజీ MLA గ్యాదరి కిషోర్ కుమార్ .తనదైన శైలిలో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.బుధవారం నాడు ఆయన తుంగతుర్తి నియోజక వర్గ పరిధిలోని మండలం మిర్యాల,అలగనూరు తదితర గ్రామాల్లో నిర్వహించిన ప్రచారశైలికి ప్రజలు బ్రహ్మ రథం పట్టారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,KCR గారి ఆశీర్వాదంతో అన్ని పనులు జరిగాయి.గత పాలకులకు భిన్నంగా ఈ నియోజక వర్గంలో నాలుగున్నరేళ్ల కాలంలో 1600 కోట్లతో ప్రగతి పనులు పూర్తి చేయించాము అన్నారు.విద్య,వైద్య,త్రాగు నీరు,సాగునీటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.మరోమారు ఈ ప్రాంత ప్రజలు తనను ఆశీర్వదించి అసెంబ్లీ కి పంపిస్తే రాష్ట్రంలోనే తుంగతుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

error: