అచ్చం పేట కాంగ్రెస్ సభలో అపశృతి

మహబూబ్ నగర్ జిల్లా అచ్చం పేట కాంగ్రెస్ సభలో అపశృతి చోటు చేసుకుంది.సభా వేదిక ఒక్కసారిగా కూలి పోవడంతో,కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి స్టేజి ఫై నుంచి కింద పడ్డారు.ఐతే రాములమ్మ సహా వేదికపై ఉన్న పలువురు నేతలకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో,అక్కడున్న కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.కాగా అనుకున్నదానికంటే ఎక్కువమంది వేదికపైకి రావడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది.

error: