ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా ?

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డివి మతిలేని మాటలని,తెలంగాణ గురించి కానీ,ఇక్కడి ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడే అర్హతే ఆయనకు లేదని నీటి పారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు గారు,హోమ్ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి గారు ధ్వజమెత్తారు.ఎన్నికలో సమయంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎవరు పట్టించుకోవడం లేదని అబద్దాలు మాట్లాడితే గుర్తింపు వస్తుందని దిగజారి మాట్లాడారని విమర్శించారు.కాంగ్రెస్ లో ఉంది అవినీతి ఫై మౌనం దాల్చిన జైపాల్ రెడ్డి వైఖరి గురువింద గింజ లా ఉందన్నారు.జైపాల్ రెడ్డి మాటలు చూస్తుంటే పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకం అంత పచ్చగా కనిపిస్తున్నట్లు ఉంది.ఎక్కడికైనా వస్తా,ఆధారాలన్నీ తెస్తా ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు.

error: