తెరాస ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టో చూస్తేనే ప్రతిపక్షాలు భయపడుతున్నాయని,ఇంకా పూర్తి మేనిఫెస్టో చూస్తే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటారేమో అని మంత్రి కడియం శ్రీహరి అన్నారు.దోపిడీ దొంగలంతా కాంగ్రెస్ లోనే ఉన్నారన్నారు.తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.తెరాస అమలు చేస్తున్న పథకాలకు దేశంలోనే మంచి పేరు ఉందని,దాన్ని ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయన్నారు.
