రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అంటూ కోదండరాం తెచ్చిన తెలంగాణ జనసమితి పార్టీ ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లింది.ప్రజాదరణతో ఆ పార్టీ కి అంత సీన్ లేదని తేల్చేసింది.పలు సర్వే నివేదికలను ఆధారం చేసుకున్న కాంగ్రెస్ TJS కు 8 సీట్లు మాత్రమే కేటాయించి చేతులు దులిపేసుకుంది.మహాకూటమిలో చేరిన నాటినుంచే ఆ పార్టీ నేతల్లో విశ్వసం సన్నగిల్లుతూ వచ్చింది.దీనికి తోడు తెలంగాణాలో అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు తో జత కట్టడంతో ఆ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది.ఈ విషయం పలు సర్వే ల ద్వారా వెల్లడి కావడాన్ని గుర్తించిన కాంగ్రెస్,TJS అడిగిన దాంట్లో మూడోవంతు సీట్లను మాత్రమే కేటాయించి అవమానించింది.కాంగ్రెస్ ప్రకటనతో షాక్ కు గురైన కోదండరాం ను కూల్ చేసేందుకు ఢిల్లీ రావాలని కాంగ్రెస్ నేతలు ఆహ్వానించారు.
