వంద రోజుల్లో NRI పాలసీ-ఉత్తమ్

తాము అధికారంలోకి రాగానే అరబ్ దేశాల్లో ఇబ్బంది పడుతున్న తెలంగాణ కార్మికుల కోసం గల్ఫ్ సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.గల్ఫ్ దేశాల్లోని 10 లక్షల మంది తెలంగాణ కార్మికులకు వీటి ద్వారా సహాయం అందిస్తామని తెలిపారు.శుక్రవారం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ RC కుంతియా,పత్తి నేతలు మధుయాష్కీ,జీవన్ రెడ్డి,పీసీసీ NRI విభాగం కన్వినర్ SV రెడ్డి లతో కలిసి ఆయన దుబాయ్ లోని అల్క్వాజ్ ప్రాంతంలో తెలంగాణ కార్మికుల క్యాంపులకు వెళ్లారు.వారి సమస్యలు తెలుసుకున్నారు.రాస్తుంటీరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు NRI పాలసీ ని తెస్తామన్నారు.ప్రతి జిల్లాలో NRI సెల్ ఏర్పాటు చేస్తామన్నారు.కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారిని,అనారోగ్యానికి గురయ్యే కార్మికులను గల్ఫ్ సహాయక కేంద్రాల ద్వారా ఆదుకుంటామన్నారు.

error: