గతంలో KCR నా దగ్గరికి రాలేదా-జానారెడ్డి

మా అధినేత రాహుల్ గాంధీని చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లి కలిసినప్పుడు,మేం బాబు దగ్గరికి వెళ్లి కలిస్తే తప్పేంటి?అని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రశ్నించారు.చంద్రబాబు ఏపీ భవన్ లో ఉన్న సమయంలో తాను అక్కడే పక్క గదిలో ఉన్నానని,దాంతో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు.అంతే కానీ ఆయన్ని కలిసేందుకు తాను వేచి చూడలేదని అన్నారు.తెలంగాణ అభివృద్ధి విషయంలో బాబు జోక్యం ఉండదని,ఉంటె సహించమని చెప్పారు.తర్వాత మీడియా తో చిట్ చాట్ చేసారు.తెలంగాణ ఆత్మగౌరవాన్ని KCR దెబ్బ తీస్తుంటేనే ఊరుకోవడం లేదు.అలాంటిది చంద్రబాబు ఇక్కడ అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకుంటామా అన్నారు.

error: