రెండేండ్లలో సిద్దిపేటకు రైలు కూత వినబడుతుంది-KCR

కోనాయిపల్లి వెంకన్న స్వామి ఆశీర్వాదం తీసుకొని ఏ కార్యక్రమం చేపట్టినా ఓటమనేదే ఎదురుకాలేదు.మళ్ళీ ఈ స్వామి వారి ఆశీస్సులు,మీ దీవెనలతో యుద్దానికి పోతున్నా.100 సీట్లు సాధించి మళ్ళీ అద్భుతమైన అధికారాన్ని చేపట్టబోతున్నాం అని KCR గారు అన్నారు.నిండుమనసుతో ఆశీర్వదించాలని కోరారు.బుధవారం మధ్యాహ్నం గజ్వేల్ RDO కార్యాలయంలో ముఖ్యమంత్రి తన నామినేషన్ పాత్రలను దాఖలు చేసారు.అంతకుముందు తనకు ఇష్టదైవమైన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎర్రవల్లిలో తన వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్ మార్గాన ఉదయం ౧౧.45 నిమిషాలకు కొన్నాయిపల్లి ఆలయంకు చేరుకున్న సీఎంకు హరీష్ రావు,శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి,విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు,స్థానిక ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.

error: