ఆంధ్రలో వరాలు కురిపించడానికి తెలంగాణ లో మీటింగా -హరీష్ రావు

ఆంధ్రలో సీఎం చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ను కాంగ్రెస్ ఎన్నికల సభలో సోనియాగాంధీ చదివారని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు విమర్శించారు.తెలంగాణ లో తెరాస మల్లి గెలుస్తుందన్న భయంతోనే సోనియాగాంధీకి దుఃఖం పొంగుకువస్తున్నదని ఎద్దేవా చేసారు.ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తున్న KCR వంటి వ్యక్తి తమ పార్టీలో లేడన్న బాధ కూడా సోనియా లో కనిపించిందన్నారు.శనివారం మహబూబ్ నగర్ జిల్లా ఆడ్డాకుల వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్ రావు అనంతరం వనపర్తి జిల్లా ఆత్మకూరు రోడ్డుషో లో,మక్తల్ తో పాటు జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయా చోట్ల ఆయన మాట్లాడారు.తెలంగాణ ను చూస్తే సోనియాగాంధీకి దుఃఖమెందుకు వస్తుందని హరీష్ రావు ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అధికారాన్ని చేపట్టిన సీఎం KCR దేశంలో ఎక్కడ లేని విదంగా అభివృద్ధి,సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనతను సాధించారన్నారు.

error: