మనమంతా హైదెరాబాదీలమే అని,అందరం కలిసికట్టుగా ఉందామని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి KTR హైదరాబాద్ లోని సీమాంధ్రులకు పిలుపునిచ్చారు.హైదరాబాద్ మినీ ఇండియా లాంటిదని,అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారని గుర్తు చేసారు.తెలంగాణ GSTP లో 45-50%హైదరాబాద్ నుంచే వస్తుందని వివరించారు.తెలంగాణ లో ఉపాధి అవకాశాలు,ఆదాయం,వనరులు పెరుగుతుంటే సీమాంధ్రులు కూడా లాభపడుతారని వివరించారు.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణాలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.తొమ్మిదేండ్లలో హైదరాబాద్ ను కట్టానని చెప్పుకునే చంద్రబాబు ఐదేండ్లలో అమరావతిని ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు.వ్యక్తుల వల్ల కాకుండా హైదరాబాద్ కు ఉన్న గొప్పతనం వల్లనే ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తరలి వస్తున్నాయని చెప్పారు.నిన్న జరిగిన కూకట్పల్లి లో సీమాంధ్రులు తెరాస కు సంఘీభావంగా నిర్వహించిన సమావేశానికి పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు తో కలిసి మంత్రి KTR హాజరయ్యారు.