మంత్రివర్గ విస్తరణకు కసరత్తు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీలో మకాం వేశారు. దేశవ్యాప్తంగా పర్యటించి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని – ఇప్పటికే పలు రాష్ట్ర సీఎంలతో కేసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్ కతా నుంచి ముఖ్యమంత్రి సోమవారం రాత్రి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. తుగ్లగ్ రోడ్డులోని తన నివాసంలో మంగళవారం రాష్ట్ర ఎంపీలతో సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. కాంగ్రెస్ – బీజేపీయేతర పార్టీల అధినేతలు ఎవరెవరూ ఢిల్లీలో ఉన్నారన్న సమాచారం తన ఎంపీలతో కేసీఆర్ తెలుసుకుంటున్నారు. అందుబాటులో ఉన్న నాయకులతో సమావేశం కావాలని సీఎం యోచిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీకి రావడంతో… ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.

error: