ఇది ఒక అమరుడి కథ

ఇక అంతా ముగిసిపోయిందని ఆమె అనుకుంది…
అతను శాశ్వతంగా వెళ్ళిపోయాడు అని అందరు అనుకున్నారు…
కానీ అతను తెచ్చిన పువ్వుల్లో అతను ఇంకా బతికే ఉన్నాడు …

ఆ పూలు ఎన్నో ముచ్చట్లు చెబుతాయి…
అతనికి భావాలకి బాట చూపుతాయి…

ఎప్పుడూ అనుకునే వాడు…
ఆమె లేనిదే ఏమి లేదని,తన బతుకే వేరని…

అతనికి జీవించడం ఓ అవకాశం …

అందుకే పూలు అమ్మేవాడికి ముందుగానే డబ్బిచ్చేశాడు …
పూలు అలానే వస్తూనే ఉన్నాయి …

పుట్టిన రోజు,పెళ్లిరోజు …ప్రతి సందర్భంలో శుభాకాంక్షలు ఆమెకు చెబుతూనే ఉన్నాయి…
ఆమె పూలను తన హృదయానికి హత్తుకుంది…

ప్రతి పువ్వులో అతన్ని చూసుకుంది,అతని నిష్క్రమణ గురించే ఆలోచిస్తోంది…
పూలు వస్తూనే ఉన్నాయి …జీవనరథం సాగిపోవాలని అతనికి చెబుతూనే ఉన్నాయి…

ఆమె పూలు పట్టుకుని రోదించింది…నవ్వింది..

జీవితం , మరణం …

ఇవేమి అతనికి పెద్ద విషయాలు కావని అంటోంది…!!

భరతమాత భూమి పోరులో బాంబుల మోతలో తల్లడిల్లి మీ దేహాలు పుల్వామా ఉగ్రదాడిలో నెత్తుటి మరకలతో రక్తసిక్తమై వీరమరణం పొందిన భారత జవాన్లకు కన్నీటి వీడ్కోలు …

మీ మరణం వృథా పోదు …
మీ త్యాగం ఈ నేల మరవదు…

error: