మోకాళ్ల మీద కొండ‌లెక్కుతున్న నేత‌లు

శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికి వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో స‌త్తా చూపిస్తామంటున్నారు ఆ పార్టీ నేత‌లు. ఇందులో భాగంగా ఎంపీ సీట్లు కూడా పెద్ద యెత్తున ఆశిస్తున్నారు నాయ‌కులు. కాంగ్రెస్ అదిష్టానం ఎంపీ సీటు కేటాయిస్తే గెలిచి చూపిస్తామ‌ని కొంద‌రు నేత‌లు అంటుంటే, సీటు త‌మ‌కే కేటాయించాల‌ని కొంత మంది నేత‌లు మోకాళ్ల ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు.

పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ను స్థానిక నాయకుడు ఊట్ల వరప్రసాద్ కే కేటాయించాల‌ని కోరుతూ దేవుని పల్లి నరసింహ స్వామి గుడిలోని దాదాపు 416 మెట్లను మోకాళ్ళపైన ఎక్కారు కాంగ్రెస్ సేవాదళ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్. స్థానిక నాయకునికి ఎంపీ టికెట్ కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని , ఇప్పటివరకు పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి స్థానికేతరులకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగిందని అన్నారు. స్థానిక నాయకుడు, ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడేవాడు , ఊట్ల వరప్రసాద్ గారికి టికెట్ ఇచ్చినట్లయితే గెలిపించుకుంటామని ధీమా వ్య‌క్తం చేసారు ప్ర‌స‌న్న కుమార్.

ఈ నేపథ్యంలో ఈ సీటు కోసం భారీగా దరఖాస్తులు రావడం గమనార్హం. గత శాసనసభ ఎన్నికల సమయంలో నామినేషన్ల దాఖలు గడువు ముగిసే చివరి రోజు వరకు కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను విడతలవారీగా ప్రకటిస్తూ వచ్చింది. దీంతో గెలవగలిగిన అనేక సీట్లను కోల్పోయామని ఆ పార్టీ భావిస్తోంది. ఈ అనుభవం దృష్ట్యా లోక్‌సభ ఎన్నికలకు సాధ్యమైనంత ముందుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది.

error: