కలైంజ్ఞర్‌ ముత్తువేల్ ఇక లేరు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ‘కళైంజర్’ కరుణానిధి మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు.

ఆయన మరణవార్త తమిళనాడును, అశేష అభిమాన జనాన్ని కన్నీటి కడలిలో ముంచింది. ఆయన భౌతిక కాయాన్ని బుధవారం నాడు చెన్నై రాజాజీ హాల్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచి అనంతరం అంత్యక్రియలు జరుపుతారు. కరుణానిధి మృతికి సంతాప సూచకంగా తమిళనాడు ప్రభుత్వం నేడు ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు, ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.

ఆయన అసలు పేరు దక్షిణామూర్తి. అందరికీ తెలిసిన పేరు ఎం.కరుణానిధి. ఓ తెలుగు సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించిన కరుణానిధి తమిళుల గుండెల్లో కలైజ్ఞర్‌గా చిరస్థాయిగా నిలిచిపోయారు. తమిళనాడు వంటి సంక్లిష్ట రాజకీయాల్లో పదమూడు సార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన జీవిత ప్రస్థానంలో ఎన్నెన్నో మలుపులు.

తన పేరు కంటే కలైజ్ఞర్‌(నటుడు)గానే అభిమానులకు, ప్రజలకు కరుణానిధి ప్రసిద్ధులు. కలైజ్ఞర్‌ కరుణానిధి అంటూ ఆయన ఇంటి పేరుగా మారిన ఈ పదం నిజానికి బిరుదు. ఉడన్‌ పెరప్పు కడిదం (నాతోబుట్టువులకు లేఖ) నినాదంతో కరుణ రాసిన ఓ రచన అప్పట్లో ప్రజల మదిని దోచుకుంది.

కరుణానిధి పార్థివ దేహాన్ని మంగళవారం రాత్రి గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ నిర్వహించాల్సిన క్రతువులు పూర్తి చేసిన తర్వాత అభిమానులు సందర్శనార్థం పార్థివ దేహాన్ని రాజాజీ హాలుకు తరలిస్తారు.

error: