నిరుపేదలకు చేయూతను అందించడమే బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ లక్ష్యం

50 మంది పేద ముస్లింలకు రంజాన్ కిట్ల పంపిణీ పేద వృద్ధులకు, వితంతువులకు చేయూతను అందించడమే లక్ష్యంగా తమ ట్రస్టు పనిచేస్తుందని బిస్మిల్లా బైతుల్ మాల్ ట్రస్ట్ అధ్యక్షులు చాంద్ మియా తెలిపారు. బుధవారం
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి రూ. 1500 ల విలువచేసే రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని.. దానధర్మాలకు ప్రతీక అని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుండి దుబ్బాక మండలం లో నిరుపేదలకు తమ ట్రస్టు తరఫున సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. ట్రస్టుకు విరాళాలు ఇచ్చిన దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో ఈ ట్రస్ట్ మరింత సేవా కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సంఘాల నేతలు ఖదీర్, రఫీ, అబ్దుల్ రహీం, సలీం, మౌలానా తన జిల్ , షంషీర్‌, అలిమ్, ఏక్బాల్, షబ్బిర్, మజర్‌, బాబా, అమీర్ అలీ, సమియో ద్దిన్, జమీర్ తదితరులు పాల్గొన్నారు.

error: