మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ పర్సనల్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆయన అకౌంట్‌లో క్రిప్టో కరెన్సీకి సంబంధించి వరుస ట్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. పీఎం కోవిడ్ కేర్ సహాయనిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు అందించాలంటూ దుండగులు వరుస ట్వీట్స్ చేశారు. వెంటనే స్పందించిన అధికారులు ఈ ట్వీట్లను తొలగించారు. జాన్ విక్ అనే యూజర్.. పీఎం మోడీ అకౌంట్‌ను హ్యాక్ చేసినట్లు ప్రకటించాడు. మోడీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ట్విట్టర్ కూడా అధికారికంగా ధృవీకరించింది. ఖాతాను పున:ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ప్రధాని మోడీ వ్యక్తిగత వెబ్ సైట్‌కు అనుసంధానంగా ఉన్న ఈ ట్విట్టర్ అకౌంట్‌కు 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అకౌంట్‌ను మే 2011లో ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ అకౌంట్ ద్వారా ఇప్పటివరకు మోడీ 37 వేల ట్వీట్లు చేశారు. మోడీ ఈ అకౌంట్ నుంచి చివరిసారిగా ఆగష్టు 31న మన్ కీ బాత్ గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

error: