ఈ ఊరంతా కరోనా…

ఆ ఊరు ఊరంతా కరోనా…ఎలా సోకిందంటే.

ఆ గ్రామంలో మొత్తం జనాభా 500.
సహపంక్తి భోజనాలు చేశారు.
ఇప్పటికే వందమందికి వైరస్ సోకింది.
దీంతో ఊరంతా ఐసోలేషన్‌లో ఉంది. మిగిలిన వారు కూడా టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

పెళ్లికెళ్తే కరోనా చావుకు వెళ్తే కరోనా ఇప్పుడు ఎక్కడికి వెళ్లిన మన వెంటపడి వేధిస్తోన్న వైరస్ కరోనా. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో అన్ లాక్ ప్రక్రియ కూడా కావడంతో జనం కూడా కరోనాతో సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఈక్రమంలో ఏ కార్యక్రమం కోసం అయిన ఓ పదిమంది కూడితే అక్కడ కరోనా కూడా ప్రత్యక్షమవుతోంది. తాజాగా తెలంగాణలో ఓ ఊరు ఊరంతా కరోనా బారిన ఘటన చోటు చేసుకుంది.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్కే పురంలో ఊరిలో దాదాపుగా ప్రజలందరికీ దాదాపు కరోనా సోకింది.

ఊరంతా కరోనా
అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు.
ఆ ఊరిలో ఓ వ్యక్తి దినకర్మ సహపంక్తి భోజనాలే ఇందుకు కారణం.

సహపంక్తి భోజనాలు చేసిన సగం మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.
గ్రామ పంచాయతీలో 500 జనాభా ఉంటే 100కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో ప్రజలంతా భయంతో ఇళ్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
ఊరిలో మిగిలిన వారు కూడా కరోనా టెస్ట్‌లకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అంతా టెస్ట్‌లు చేయించు కుంటే ఇంకెన్ని కేసులు బయట పడతాయోనని భయపడుతున్నారు. మరోవైపు కరోనా భయంతో జనమంతా హోం ఐసోలేషన్ కు పరిమితమయ్యారు. గ్రామస్థులెవరూ ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. కరోనా కేసులు ఎక్కువగా రావడంతో గ్రామానికి వచ్చే రోడ్లను కూడా దిగ్బంధం చేశారు అధికారులు. గ్రామాల్లోకి ఎవరిని రానీయకుండా చర్యలు చేపట్టారు.

error: