కూతుళ్ళని చంపి , బతికేస్తారంటూ….

చిత్తూరు జిల్లాలో ఇద్దరు యువతుల హత్యకేసు సంచలనంరేపుతోంది. ఇద్దర్ని తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. దంపతుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.. ఈ హత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.. బంధువుల్ని, తోటి ఉద్యోగుల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో సంచలన విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. ఇద్దరు కూతుళ్లను జోగ్ వాటర్ ఫాల్స్‌కు పంపేందుకు ఏర్పాట్లు తండ్రి పురుషోత్తంనాయుడు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల టూర్‌కు అన్ని ఏర్పాట్లు చేయగా.. ఇంతలోనే క్షుద్ర మాయలో పడి ఇద్దరు పిల్లల్ని కడతేర్చినట్లు చెబుతున్నారట. ఉదయానికి తమ ఇద్దరు పిల్లలు బతికి వస్తారంటూ పోలీసులతో చెప్పారట.
ఇటు మృతుల్లో ఒకరైన పురుషోత్తం రెండో కుమార్తె సాయిదివ్య మూడు రోజుల కిందట సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టినట్లు విచారణలో తేలిందట. ‘శివ ఈజ్‌ కమ్‌.. వర్క్‌ ఈజ్‌ డన్‌’ అంటూ యువతి పోస్టులు పెట్టడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు క్లూస్‌ టీం చిత్తూరు నుంచి మదనపల్లె వెళ్లింది.. మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కరోనా సమయం నుంచి తల్లిదండ్రులు, ఇద్దరు కూతుళ్లు ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇంట్లో పనికి వెళ్లే వారిని కూడా రానివ్వడం లేదని తెలుస్తోంది.

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె శివనగర్‌కు చెందిన ఎన్‌.పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. భార్య పద్మజ ప్రైవేట్ విద్యాసంస్థలో ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. వీరికి అలేఖ్య , సాయిదివ్యలు సంతానం. వీరిలో పెద్ద కుమార్తె అలేఖ్య భోపాల్‌లో పీజీ చేస్తుండగా.. చిన్నకుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది. వీరు గతేడాది ఆగస్టులో శివనగర్‌లో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు.

కరోనా సమయం నుంచి ఇంట్లో తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి ఇంట్లో పూజలు నిర్వహించి మొదట సాయి దివ్యను, తర్వాత అలేఖ్యనుపైన ఉన్న అంతస్తులో ఒకరిని, కింద అంతస్తులో ఇంకొకరికి చీర కట్టి.. నోట్లో రాగి చెంబు పెట్టి.. తలపై డంబెల్‌లో కొట్టి చంపారు. ఇంట్లో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో స్థానికులు గుర్తించి కళాశాల సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో డీఎస్పీ, పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు.

ఆధ్యాత్మికంగా దేవుడు, దేవుడికి దాటి ఎక్కడికో వెళ్లిపోయారని చెప్పారు. ఇందులో భాగంగానే ఇద్దరు అమ్మాయిలకు పూజలు చేసి, డంబెల్‌తో కొట్టి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఒక్క రోజు రాత్రి ఆగండి.. పిల్లలు తిరిగి లేచి వస్తారు అని చెబుతున్నారట. వీళ్లు చెబుతున్న దాన్ని బట్టి పూర్తిగా ఆధ్యాత్మికంగా దాటి వెళ్లిపోయారని వివరించారు. ఉన్నత విద్యావంతులే ఆధ్యాత్మిక పిచ్చితో ఇద్దరు బిడ్డల్ని కిరాతకంగా చంపేయడం కలకలంరేపింది.

error: