రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4 డిగ్రీలు అదనంగా పెరగడంతో ఎండల వేడి రాజుకుంటోంది.వేసవి రాకముందే వేడి,ఉక్కపోతలు మొదలయ్యాయి.2021లో తొలిసారి శనివారం పగలు రాష్ట్రంలో కెల్లా అత్యధికంగా భద్రాద్రి జిల్లా కొత్తగూడెం,సుజాత నగర్ లి 39.1,మద్దూట్లలో 38.4,రామగుండంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడం ఈ శీతాకాలంలో ఇదే తొలిసారి.శీతాకాలం సీజన్ చివరి దశకు వచ్చినందున ఇక చలి ప్రభావం పెద్దగా ఉండదని,క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న చెప్పారు.