ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ కుటుంబం చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకుంది.ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.పటాన్ పోలీసు స్టేషన్ పరిధిలోని బతెనా గ్రామానికి చెందిన రామ్ బ్రిజ్ గైక్వాడ్(52), జానకి బాయి(47) దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమారుడు సంజు(24), కూతుర్లు దుర్గ(28), జ్యోతి(21) ఉన్నారు. అయితే ఈ కుటుంబాన్ని గత కొంతకాలం నుంచి ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి.ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన గైక్వాడ్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.గైక్వాడ్, సంజు ఉరి వేసుకోగా, మిగతా ముగ్గురు నిప్పంటించుకుని సూసైడ్ చేసుకున్నారు.ఘటనాస్థలిలో లభ్యమైన సూసైడ్ నోట్లో ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఉంది.గైక్వాడ్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.పోస్టుమార్టం నిమిత్తం దుర్గ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబం ఆత్మహత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి సాహూ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.