విమానాల్లో ఫేస్ మాస్క్ వేసుకోవాల్సిందే

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గిపోతున్నది. దీంతో కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై విమాన ప్రయాణ సమయంలో ఫేస్‌ మాస్క్‌ తప్పనిసరి కాదని పేర్కొన్నది. అయితే వైరస్‌ ముప్పును దృష్టిలో పెట్టుకుని మాస్కును ధరించాలని సూచించింది. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్యశాఖతో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నది.

కాగా, మాస్కులకు సంబంధించి విమానయాన సంస్థలకు మరో సూచన చేసింది. ప్రయాణికులు మాస్కులను సరిగా ధరించాలని విమానాల్లో ప్రకటనలు చేసుకోవచ్చని, కానీ.. ధరించనివారికి చర్యలు, ఫైన్లకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విమానాల్లో ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఫేస్‌ మాస్క్‌ను తప్పనిసరి చేసింది. దీంతో మాస్క్‌ ధరించని వారికి విమానయాన సంస్థలు ఫైన్లు విధించడం, విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించడం వంటివి చేశాయి.

error: