టీఎస్ పోలీస్‌: 18,428 పోస్టుల భ‌ర్తీ

కానిస్టుబుల్ పోస్టుల‌కు సంబంధించి విభాగాల‌వారీ ఖాళీలు ఇలా ఉన్నాయి…
సివిల్‌: 5909, ఏఆర్‌: 5273, ఎస్ ఏ ఆర్ సీపీఎల్:53, టీఎస్ ఎస్ పీ: 4816, ఎస్ పీ ఎఫ్‌: 485, ఫైర్ స‌ర్వీస్: 168, వార్డ‌ర్స్ (మేల్‌): 186, వార్డ‌ర్స్ ( ఫిమేల్‌): 35, ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్‌: 142, మెకానిక్స్ (ట్రాన్స్ పోర్ట్‌) : 19, డ్రైవ‌ర్స్‌: 70
విద్యార్హ‌త‌: ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త‌. ఐటీ అండ్ క‌మ్యూనికేష‌న్‌, డ్రైవ‌ర్ పోస్టుల‌కు నిబంధ‌ల మేర‌కు అర్హ‌త‌లు అవ‌స‌రం. ఎస్టీ అభ్య‌ర్థులు ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త సాధించి ఇంట‌ర్ రెండేళ్ల ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైతే స‌రిపోతుంది.
వ‌య‌సు: పై అన్ని పోస్టుల‌కు జులై 1, 2018 నాటికి 18 – 22 ఏళ్ల‌లోపు ఉండాలి. అంటే జులై 2, 1996 కంటే ముందు, జులై 1, 2000 త‌ర్వాత జ‌న్మించిన‌వారు అన‌ర్హులు. డ్రైవ‌ర్ పోస్టుల‌కు 21-25 ఏళ్ల‌లోపు వారు అర్హులు.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీల‌కు రూ.400, మిగిలిన అంద‌రికీ రూ.800

ఎస్సై పోస్టుల ఖాళీల వివ‌రాలు:
సివిల్: 710, ఏఆర్‌: 275, ఎస్ ఏ ఆర్ సీపీఎల్‌: 5, రిజ‌ర్వ్: 175, రిజ‌ర్వ్ (15వ బెటాలియ‌న్‌): 16, ఫైర్ స‌ర్వీస్: 19, డిప్యూటీ జైల‌ర్‌: 15, అసిస్టెంట్ మ్యాట్ర‌న్‌: 2, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, కమ్యూనికేష‌న్స్‌: 29, ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరో: 26

విద్యార్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఎస్టీ అభ్య‌ర్థులైతే ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త‌తోపాటు క‌నీసం మూడేళ్ల డిగ్రీ కోర్సు చ‌దివితే స‌రిపోతుంది. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, కమ్యూనికేష‌న్స్ పోస్టుల‌కు ఈసీఈ/ ఈఈఈ/ సీఎస్‌/ ఐటీ వీటిలో ఎందులోనైనా బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త ఉండాలి. ఫింగ‌ర్ ప్రింట్ బ్యూరో పోస్టుల‌కు కంప్యూట‌ర్ సైన్స్ / ఐటీ/ క‌ంప్యూట‌ర్ అప్లికేష‌న్స్ వీటొలో ఎందులోనైనా డిగ్రీ ఉండాలి.

వ‌య‌సు: జులై 1, 2018 నాటికి 21 నుంచి 25 ఏళ్ల‌లోపు ఉండాలి. ఫైర్ స‌ర్వీస్‌, డిప్యూటీ జైల‌ర్ పోస్టుల‌కు 30 ఏళ్ల‌లోపువారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీల‌కు రూ.500. మిగిలిన అంద‌రికీ రూ.1000.

error: