ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లాంబాక్ ద్వీపాన్ని ఆదివారం తీవ్రమైన భూకంపం అతలాకుతలం చేసింది. బాలీ ద్వీపానికి 50 మైళ్ల దూరంలోని లాంబాక్‌లో భూకంపం కారణంగా 37మంది వ్యక్తులు మృత్యువాతపడగా వందల మంది గాయపడ్డారు. భారీగా ఇండ్లు నేలమట్టమ య్యాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై ఏడు పాయింట్లుగా నమోదైంది. లాంబాక్ ఉత్తర ప్రాంతంలో 10.5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. వారంరోజుల కింద భూకంపం కారణంగా 17మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకముందే తాజాగా భూకంపం రావడం గమనార్హం.