విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఘన విజయం సాధించింది విద్యుత్ రంగంలోనే అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉద్యోగులు ఉత్సాహంగా పని చేసి మరింత అభివృద్ధి సాధించాలని కోరారు.  విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ(వేతన సవరణ) ప్రకటించారు. గత పీఆర్సీ (27శాతం) కంటే ఎనిమిది శాతం ఎక్కువ ఇస్తున్నట్టు వెల్లడించారు.

రాష్ట్రం ఏర్పడిన వెంటనే జూరాల హైడల్ ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేశారని ప్రశంసించారు. తెలంగాణ ఏర్పడితే చీకటిమయం అవుతుందని శాపనార్థాలు పెట్టిన వారికే గత ఏడాది రూ. 250 కోట్ల విలువైన విద్యుత్‌ను అమ్మామని విద్యుత్ ఉద్యోగుల హర్షధ్వానాల మధ్య వెల్లడించారు.

50 వేల మంది విద్యుత్ ఉద్యోగులలో ఆరు వేల మందికి సంబంధించిన జీపీఎఫ్ అనేది కేంద్రం పరిధిలో ఉందన్నారు. వివాదంలో ఉన్న సీపీఎస్‌ను కూడా పరిష్కరించే దిశగా చర్చిస్తున్నామని సీఎం కేసీఆర్ వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా విద్యుత్ ఉద్యోగులకు కూడా భరోసా ఇచ్చేలా మంచి హెల్త్ స్కీం అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

error: