కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి-6లో ఆవిష్కృతం అయిన మరో అద్భుతం.
-భూగర్భ సొరంగంలో 400 కేవీ… గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్ ప్రారంభం.
– ప్యాకేజి -6లో 124.4 మెగావాట్ల సామర్ధ్యం గల మొదటి పంపు డ్రైరన్ విజయవంతం.
– ఇంజనీర్లను అభినందించిన మంత్రులు శ్రీ హరీశ్ రావు,శ్రీ ఈటల రాజేందర్
నిర్విరామంగా నడుస్తున్న టన్నెల్ పనులను నిన్న అర్ద రాత్రి 11గంటల సమయంలో మంత్రులు ప్యాకేజీ-6 అండర్ గ్రౌండ్ టన్నెల్ లో దిగిన డ్రైరన్ నిర్వహణ తో పాటు , ఇతర పనులను పరిశీలించారు. తన్నీరు హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ గారు ఎమ్మెల్యే పుట్టామధు గారు మరియు పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి రఘువీర్ సింగ్ గారు కాళేశ్వరం సీఈ నల్లమల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు …