క్షీణించిన రూపాయి మారకం విలువ

డాలర్ కు డిమాండ్ పెరుగడంతో… దేశీయ కరెన్సీ వెలవెలబోతోంది. ఇవాళ 16 పైసలు నష్టపోయిన రూపాయి… జీవిత కాల కనిష్టానికి పడిపోయింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 71.37 పైసలుగా ఉంది. అటు చమురు ధరలు భారీగా పెరగడం, అమెరికా కరెన్సీ డాలరుతో మారకంలో వర్ధమాన దేశాల కరెన్సీలు పతన బాట పట్టడం రూపాయి విలువను ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య భయాల నేపథ్యంలో పెట్టుబడిదారులు, దిగుమతిదారులు నుంచి డాలరుకు డిమాండ్‌ బాగా పెరిగింది.

error: