ఆండ్రాయిడ్‌ ‘పై’ అందుబాటులోకి

గూగుల్‌ తీపి కబురు.

తన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌(ఓఎస్‌)లో కొత్త వెర్షన్‌ ‘పై’ను మంగళవారం ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ సిరీస్‌లో ఇది తొమ్మిదవది. సమాచార గోప్యత(ప్రైవసీ)కు సంబంధించి మరిన్ని మెరుగైన ఫీచర్లతో పాటు పలు అధునాతన అంశాలను కొత్త ఓఎస్‌లో జతచేసినట్లు గూగుల్‌ పేర్కొంది.

‘పై’ ఓఎస్‌లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సామర్థ్యం అత్యంత ముఖ్యమైనదిగా చెబుతోంది. స్మార్ట్‌ పరికరాల్లో సమాచార గోప్యత లోపాలపై భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గూగుల్‌ నూతన ఓఎస్‌లో ప్రైవసీకి పెద్దపీట వేయడం గమనార్హం.

గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌,  మొబైల్‌ యూజర్‌ వివిధ అప్లికేషన్లను వాడే విధానాన్ని ఆండ్రాయిడ్‌ ‘పై’లోని ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎప్పటికప్పుడు గుర్తించి తదనుగుణంగా సూచనలు, సలహాలను అందిస్తుందని చెప్పారు. వివిధ సెట్టింగ్స్‌కు మీరు ఎంత స్క్రీన్‌ వెలుగును కోరుకుంటారో గుర్తించి… ఆటోమేటిక్‌గా ఆ మేరకు సర్దుబాటు చేస్తుంది.

error: