ఇక వర్క్ ఫ్రమ్ ఆఫీస్ యే…

దేశీయ ఐటీ రంగ సంస్థలు వర్క్‌ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్‌హెచ్‌) నుంచి వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ (డబ్ల్యూఎఫ్‌వో) వైపునకు అడుగులు వేస్తున్నాయి. ఇన్ఫోసిస్‌ సైతం తమ ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పనిచేయాలని కోరుతున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అంతర్గతంగా ఉద్యోగులందరికీ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే దశలవారీగా వర్క్‌ ఫ్రం ఆఫీస్‌ను అమలు చేయాలని కంపెనీ యోచిస్తున్నదని అంటున్నారు.

కాగా, ఇప్పటికే దేశీయ ఐటీ రంగ దిగ్గజం టీసీఎస్‌ ఈ తరహా ఆదేశాలను తమ ఉద్యోగులకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు హైబ్రిడ్‌ వర్క్‌ విధానాన్ని ప్రారంభించింది. కొంత మందిని ఇంటి దగ్గర్నుంచి, మరికొంత మందిని ఆఫీసుల నుంచి పనిచేయించుకోవడమే ఈ హైబ్రిడ్‌ పద్ధతి. వారంవారం లేదా నెలనెలా ఉద్యోగులు మారుతూ ఉంటారు. ఈ క్రమంలో దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ కూడా ఇదే బాటలో వెళ్తున్నట్టు వినిపిస్తున్నది.

error: