తెలంగాణ ఉద్యమసమితి రాష్ట్రఅధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ,స్వరాష్ట్ర సాధనలో భాగంగా నిర్వహించిన సాగరహారం కార్యక్రమం జరిగిన సంఘటన సందర్బంగా పాలమూరు జిల్లా కోర్ట్ విద్యార్ధి నాయకుడు మున్నూరు రవికి 6 నెలలు జైలు శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది అన్నారు.దీనిపై ఆయన స్పందిస్తూ ఉద్యమకారులు ఏమైనా టెర్రరిస్టులా?అని ప్రశ్నించారు.వారిని కాపాడుకుంటాం కడుపులో పెట్టుకుంటాం అనే పెద్దమనుషులు ఆలోచించాలి.మెం ఎవరికోసం ఉద్యమం చేసినం?తెలంగాణ రాష్ట్రము లో ఉద్యమకారులకు ఎలాగూ న్యాయం జరగలేదు.వాళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదు.మాజీ రాష్ట్ర హోమ్ మంత్రి నాయిని నరసింహారెడ్డి గారు కేసులు కొట్టేసినం అంటూ పత్రిక ప్రకటనలకే పరిమితం ఐయ్యారు.ఇప్పుడు జైలుకు పోతుంటే స్పందన కరువైంది అన్నారు.ఉద్యమ సమితి పక్షాన ఒక ఉద్యమకారుల సంక్షేమశాఖ ఏర్పాటు కోసం ఎన్ని రకాలుగా పోరాటం చేసిన పట్టించుకున్న పాపాన పోలేదు అని ఆవేదన వ్యక్తం చేసారు.