KCR మేనిఫెస్టో లో ఉద్యమకారుల గురించి వారి సంక్షేమం గురించి మాట్లాడకపోవడం తో ఉద్యమసమితి అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేసిన ఉద్యమకారులకు న్యాయం జరగాలని వారి పోరాటానికి సరైన గుర్తింపు ఇవ్వాలని ఉద్యమ సమితి పక్షాన గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న కనీసం వాటిఫై స్పందించక పోవడం బాధ కలిగించింది అన్నారు.ఈ రోజు తెలంగాణ రాష్ట్రము ఏర్పాటుకు అలాగే KCR ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ఉద్యమకారులేనని వారిని గుర్తించాలని ఆవేదన వ్యక్తం చేసారు.ఇప్పటికైనా ఉద్యమకారుల కోసం వారి సంక్షేమం కోసం ఉద్యమ కారుల సంక్షేమ శాఖ ఏర్పాటు చెయ్యాలని గతంలో కూడా మేనిఫెస్టోలో పెట్టని రైతు బందు ప్రోగ్రాం లాగే ఉద్యమ కారుల సంక్షేమశాఖ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసారు.
