జగిత్యాల జిల్లా లో కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు అనుమానం తో ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నా వారిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ సందర్శించారు.
కొండగట్టు జెఎన్టీయుతోపాటు పొలాస వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డ్ లను సోమవారం వినోద్ కుమార్ చొప్పదండి,జగిత్యాల ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్ కుమర్ లతో కలిసి సందర్శించి వార్డుల్లో ఉన్న వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
వీరి వెంట జిల్లా కలెక్టర్ రవి, ఎస్పీ సింధూ శర్మ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావా వసంత, జడ్పీటిసి ప్రశాంతి, ఆర్డీవో గంటా నరేందర్, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు