కన్నడ నట దిగ్గజం అంబరీష్ కన్నుమూత

ప్రముఖ కన్నడ నటుడు,కాంగ్రెస్ నాయకుడు అంబరీష్ (66)కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం బెంగుళూర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో గుండెపోటు తో తుది శ్వాస విడిచారు.ఆయనకు భార్య సుమలత,కుమారుడు అభిషేక్ ఉన్నారు.కన్నడనాట ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన ఆయన రాజకీయాల్లో సైతం రాణించారు.అంబరీష్ మృతి వార్త తెలియగానే ముఖ్యమంత్రి హెచ్డీ.కుమారస్వామి,మంత్రి KG జార్జ్ దవాఖానకు చేరుకున్నారు.కొద్దిసేపట్లోనే ఆయన అభిమానులు సైతం వేల సంఖ్యలో దవాఖానవద్దకు చేరుకున్నారు.అంబరీష్ చాలా కాలంగా మూత్రపిండాలు,ఊపిరితిత్తుల వ్యాధులతో భాదపడుతున్నారు.మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య,సదానంద గౌడ్,పలువురు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర మంత్రులు,సినీ ప్రముఖులు అంబరీష్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు.

error: