కుప్పకూలిన రష్యా హెలికాప్టర్‌

సైబీరియా ఉత్తరప్రాంతంలో రష్యాకు చెందిన హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. క్రాస్నాయార్క్స్ రీజియన్ తురుహస్క్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు సిబ్బంది సహా 15 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారని రష్యా విమానయాన సంస్థ ఉటైర్‌ తెలిపింది.

error: