కేసీఆర్ ఫెడరల్ యాత్ర

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చే క్రమంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం నేపథ్యంలో రెట్టించిన ఉత్సహంతో ఉన్న ముఖ్యమంత్రి తెరాస అధ్యక్షుడు కే.చంద్రశేఖర్ రావు త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటిపై కి తెచ్చేందుకు సిద్ధమౌతున్నారు.ఈ క్రమంలోనే ఆదివారం నుంచి వివిధ రాష్టాల పర్యటనకు బయలుదేరుతున్నారు.తన పర్యటనలో ఒడిశా సీఎం బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్,పశ్చిమ బెంగాల్ సీఎం,తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ,ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి BSP అఖిలేష్ యాదవ్ (సమాజ్ వాది)తో సమావేశమై జాతీయరాజకీయాలపై చర్చ చర్చించనున్నారు.బీజేపీ యేతర కాంగ్రెస్ యేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కెసిఆర్ గతంలో ప్రతిపాదన చేసినప్పుడు దేశ వ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు ఆసక్తి కనబరిచాయి. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ,దేవెగౌడ,స్టాలిన్ తదితరులతో కేసీఆర్ మాట్లాడారు.

error: