రాహుల్ గాంధీ తెలంగాణాలో రేపు పర్యటించనున్న నేపథ్యంలో గద్దర్ కీలక వ్యాఖ్యలు చేసారు.రాహుల్ గాంధీ సభలను,ఆయన పర్యటనను విజయవంతం చేయాలనీ ప్రజలకు పిలుపునిచ్చారు.దేశ ప్రజలను ఏకం చేసే నినాదంతో రాహుల్ ఉద్యమిస్తున్నారని,కాంగ్రెస్ అధ్యక్షుడు చేస్తున్న ప్రయత్నానికి అందరు సహకరించాలని గద్దర్ కోరారు.ఇటీవల ఢిల్లీలో సోనియా,రాహుల్ గాంధీలతో సమావేశమైన గద్దర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
