గోబీ పూరీ

పూరీలు ఇలా కూడా చేసుకోవచ్చు ….

గోబీ పూరీ
కావలసినవి :
గోధుమ పిండి : మూడు కప్పులు,
పసుపు : పావు చెంచా ,
నెయ్యి : ఒకటిన్నర చెంచా
ఉప్పు : తగినంత
నూనె : వేయించేందుకు సరిపడా ,
స్టఫింగ్ కోసం …
క్యాలీఫ్లవర్ తురుము : ముప్పావు కప్పు ,
కొబ్బరి తురుము : పావు కప్పు
వేయించిన పల్లీల పొడి : రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు : చెంచా,
కొత్తిమీర : కట్ట
ఉప్పు : తగినంత .
తయారీ విధానం : గోధుమ పిండిలో నెయ్యి,సరిపడా ఉప్పు,పసుపు వేసుకొని అన్నింటిని కలిపి తరువాత నీళ్లు చల్లుకుంటూ పూరీపిండిలా చేసుకుని పెట్టుకోవాలి .స్టఫింగ్ కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటిని ఓ గిన్నెలో వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి . ఇప్పుడు కొద్దిగా గోధమ పిండిని తీసుకుని పూరీలా వత్హుకుని మధ్యలో ఈ మిశ్రమం ఒకటిన్నర చెంచా ఉంచి ,అంచుల్ని మూసి మల్లి కొద్దిగా వత్తి కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి .మిగిలిన పిండిని ఇలాగే చేసుకోవాలి . వేడి వేడిగా తింటే భలే రుచిగా ఉంటాయివి .

error: