చంద్రబాబుకు ఓవైసి సవాలు

కాంగ్రెస్, టిడిపి పొత్తు అంశంపై అసదుద్దీన్ స్పందిస్తూ, కాంగ్రెస్‌తో పొత్తు అంటే తెలుగు వారి ఆత్మగౌరవం ఏటుపోయిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని,  వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టిఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని, టిఆర్‌ఎస్, ఎంఐఎంను ఓడించడం చంద్రబాబు తరం కాదని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలువాలని అసదుద్దీన్ చంద్రబాబుకు సవా లు చేశారు. సెక్యులరిజం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు నిన్నటి వరకు బిజెపి వెంట ఉన్నారని, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించారని, ఆనాడు సెక్యులరిజం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. టిడిపి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడే పీరూఖాన్, జునేద్ వంటి మైనారిటీ వ్యక్తులను అల్లరి మూకలు చంపితే చంద్రబాబు ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

error: