ఏపీలోని ఏలూరు నగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పార్టీ మీటింగ్ లో తెలంగాణ ఎన్నికల అంశాన్ని జనసేన చర్చించింది.ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి,జనసేన స్టాండ్ ఏంటీ అని నేతలు-కార్యకర్తలు ప్రశ్నలు సంధించారు.ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సీఎం కేసీఆర్ పరిపాలన బాగుంది.కాళేశ్వరం,పాలమూరు లాంటి భారీ నీటి ప్రాజెక్టులు కడుతున్నారు.పెన్షన్స్ చెల్లింపులోనూ పారదర్శకంగా ఉంది.డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు.బడుగు,బలహీన వర్గాలకు అండగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా మెలగాలని పిలుపునిచ్చారు..
