హైదరాబాద్: టీఆర్ఎస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గాంధీ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరై మాట్లాడారు. మళ్ళీ స్వగృహానికి వచ్చిన చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మనస్ఫూర్తిగా స్వాగతం అన్నారు. 2009లో వేర్వేరు పార్టీల్లో ఉన్నా ..ఎమ్మెల్యేలుగా మాకు మంచి పరిచయాలున్నాయన్నారు. అభివృద్ధి కోసం చెరుకు ముత్యం రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ కుటుంబానికే ఎమ్మెల్యే ఇవ్వాలని కాంగ్రెస్ లో సంప్రదాయం ఉండేదని..స్నేహపూరిత రాజకీయాలను, సంప్రదాయ ఆచారాలను తుంగలో తొక్కి , టీఆరెఎస్ నారాయఖేడ్ లో పోటీ చేసిందన్నారు. దుబ్బాక ఎన్నికలో టీఆరెస్ కు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని.. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి .. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేయాలని తెలిపారు సీతక్క. దుబ్బాక ఎన్నిక గెలిచి సోనియా గాంధీకి కానుకగా ఇద్దామని తెలిపారు ములుగు ఎమ్మెల్యే సీతక్క.
Tags cheruku muthyam reddy cheruku srinivas reddy danasari seethakka dubbaka bi elections hyderabad mulugu mla telangana